Power Star | మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నారా..?

Power Star | మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నారా..?

Power Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఇటీవల ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. మరి.. నెక్ట్స్ ఏంటి అంటే.. ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ (Release) చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ డేట్ లీకైంది. ఇంతకీ.. ఉస్తాద్ వచ్చేది ఎప్పుడు..?

Power Star

Power Star | రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లడంతో..

ఈ భారీ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల, రాశీ ఖన్నా నటించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ని (Youtube) షేక్ చేసింది. రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లడంతో.. సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఆమధ్య ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సమ్మర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాతల్లో ఒకరైన మైత్రీ రవి శంకర్ తెలియచేశారు.

Power Star

Power Star | ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే..

ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యింది. ఇంతకీ ప్రచారంలో ఉన్న ఆ డేట్ ఏంటంటే.. ఏప్రిల్ 23 లేదా 24. ఈ రెండు డేట్స్ లో ఏదో ఒక డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్స్ లోకి రావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమాతో పవర్ స్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో అంతకు మించిన విజయం సాధిస్తారని పవర్ స్టార్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. ఉస్తాద్ రిలీజ్ డేట్ పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Power Star

CLICK HERE TO READ  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply