975,673 జీవోలను ఉపసంహరించుకోవాలని వినతి…

975,673 జీవోలను ఉపసంహరించుకోవాలని వినతి…

భవానిపురం, ఆంధ్రప్రభ : మున్సిపల్ రంగంలో 14 కీలక విభాగాలను, పౌర సేవలను పి పి పి పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 975,673 జీవోలను తక్షణమే ఉపసంహరించాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు దొనేపూడి కాశీనాథ్ , నగర ప్రధాన కార్యదర్శి ఎస్ జ్యోతి బసు, వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు లేఖ రాశారు. మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు నష్టదాయకమైన 14 కీలక విభాగాల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు ఎన్డీఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఈ విధులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల దశాబ్దాల తరబడి ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేసిన కార్మికులకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. ఇటువంటి చర్యల వలన కార్మికుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగడానికి దారితీస్తుందని ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించాలని తమ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అద్దంకి వెంకటరమణ, వీ సాంబశివరావు, పీ శ్రీను మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ పాల్గొన్నారు.