ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యం

  • ఎంఈఓ లలిత కుమారి

శావల్యాపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మండల విద్యాశాఖ రెండవ అధికారి పుసులూరి లలిత కుమారి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని మతుకుమల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలిత కుమారి పాల్గొని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నలుగురు విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక భోధన, అధునాతన సామగ్రి, అర్హత కలిగిన ఉపాధ్యాయులున్నారన్నారు.

విద్యార్థిమిత్ర ద్వారా ఉచితంగా కిట్లను పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్ఠి కాహారం అందిస్తున్నామన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, అందుకు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 10వ తరగతి విద్యార్థుల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఎంఈఓతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Leave a Reply