రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
మెండోరా, ఆంద్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం (వానకాలం 2026) కింద కొత్త దరఖాస్తులు, బ్యాంక్ వివరాల అప్డేట్ కోసం జులై 5 లోగా దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వసంత్ తెలిపారు. 15 జూన్ 2026 వరకు కొత్త పట్టా పాసు బుక్ వచ్చిన రైతులు మరియు ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు లేదా బ్యాంక్ వివరాలు నమోదు చేయని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతు భరోసాకు అవసరమైన పత్రాలను సమర్పించవలసి ఉంటుందన్నారు. అందుకు కావలసిన పత్రాలు రైతు భరోసా అప్లికేషన్ ఫారం, పట్టాదార్ పాస్ బుక్ (పిపిబి) కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్ చెక్, మొబైల్ నంబర్ తీసుకొని రైతువేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు చివరి తేదీకి ముందే వివరాలు నమోదు చేసుకుని రైతు భరోసా ప్రయోజనం పొందగలరని తెలియచేశారు.
