6:00 P.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు

లెబనాన్‌పై దాడులే కారణం… అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ, ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణకు జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత పరిస్థితులు చక్కబడతాయని భావించినప్పటికీ, కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందినట్లు సమాచారం. click here to read full news

రికార్డులు, రివార్డుల కోసం ఆ ప‌ని చేయ‌ను… స్పోర్ట్స్ లో త్వరగా విజయాలు సాధించాలనే ఆలోచనతో డోపింగ్ వైపు వెళ్లొద్దని భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా యువ క్రీడాకారులకు సూచించారు. డోపింగ్ వల్ల తాత్కాలిక ప్రయోజనం కనిపించినా, కెరీర్ మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత క్రీడల్లో డోపింగ్ నిర్మూలన కోసం నీరజ్ చోప్రా ఫౌండేషన్, Indian Olympic Association (ఐఓఏ) కలిసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. click here to read full news

పాలతో కాదు.. రసాయనాలతో తయారీ.. శాకాహార వంటకాలలో విస్తృతంగా వినియోగించే పన్నీర్ ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. నగరంలో పన్నీర్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌ఎఫ్‌ఏఎస్‌టీ (హైదరాబాద్ ఫుడ్ అండ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్) అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ స్థాయిలో కల్తీ పన్నీర్ విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. పాలతో తయారు చేయాల్సిన పన్నీర్‌ను రసాయనాలు, పిండి పదార్థాలు, నాసిరకం కొవ్వులతో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వందల కిలోల నకిలీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. click here to read full news

సెమీస్‌కు భారత్.. గాయంతో మూడు నెలల విరామం తర్వాత కోర్టులోకి తిరిగి వచ్చిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్మిత చాలిహా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. మకావు ఓపెన్ సూపర్-300 టోర్నమెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించిన అశ్మిత మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే మరో భారత షట్లర్ అన్మోల్ ఖర్బ్ క్వార్టర్‌ఫైనల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. click here to read full news

ఆంధ్రప్రభ ఎఫెక్ట్ – దొంగ వేణు ఆగడాలకు బ్రేక్.. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని టెండర్ ద్వారా దక్కించుకొని అక్రమాలకు తెర తీద్దామనుకున్నా బియ్యం డాన్ దొంగ వేణు ఆగడాలకు ఆంధ్రప్రభ బ్రేకులు వేసింది. గత రెండు రోజులుగా దొడ్డు బియ్యం లెక్క తేలాల్సిందే అని. ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. click here to read full news

607 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్దే.. శీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నుంచే ప్రతికూల సంకేతాలతో ప్రారంభమై చివరి వరకు కోలుకోలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, కీలక రంగాల షేర్లలో లాభాల స్వీకరణ ప్రభావంతో సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. వారాంతపు ట్రేడింగ్‌లో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. click here to read full news

రెండు నెలల బిడ్డను నరికి చంపిన తండ్రి.. నగరంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన రెండు నెలల పసికందును అత్యంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తగా, స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. click here to read full news

పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి