ఆంధ్రప్రభ ఎఫెక్ట్ – దొంగ వేణు ఆగడాలకు బ్రేక్..
- రీ పాలిషింగ్ దందాకు చెక్
- ఆంధ్రప్రభ వరుస కథనాలు
- ఉత్తర్వులు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్
కరీంనగర్ ఆంధ్రప్రభ : ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని టెండర్ ద్వారా దక్కించుకొని అక్రమాలకు తెర తీద్దామనుకున్నా బియ్యం డాన్ దొంగ వేణు ఆగడాలకు ఆంధ్రప్రభ బ్రేకులు వేసింది. గత రెండు రోజులుగా దొడ్డు బియ్యం లెక్క తేలాల్సిందే అని. ఆంధ్రప్రభ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేసిన దొడ్డు బియ్యంను రీ-పాలిషింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయించుకోవాలని భావించిన దొంగ వేణు ఆగడాలకు చెక్ పడింది. అధికారులను తప్పుదోవ పట్టించి టెండర్ ద్వారా కొనుగోలు చేసిన దొడ్డు బియ్యంను పాళీ చేయాలని కరీంనగర్ కలెక్టర్ ద్వారా మిల్లులకు ఉత్తర్వులు జారీ చేయించారు. ఈనెల 12వ తేదీన కరీంనగర్ జిల్లా కలెక్టర్ దొడ్డు బియ్యం పాలిష్ చేసి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశం నిబంధనలకు విరుద్ధమని ఆంధ్రప్రభ కథనాలు స్పష్టం చేశాయి.


కరీంనగర్ కలెక్టర్ ఉత్తర్వులు రద్దు..
ఈనెల 12వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను కరీంనగర్ కలెక్టర్ శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రభ కథనాలతో ఉన్నతాధికారులు. ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన దాన్ని పాలిష్ చేసి ఇవ్వాలని ఎలా ఉత్తర్వులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో మందలించడంతో కలెక్టర్ ఉత్తర్వులను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
దొంగ వేణు ఆగడాలకు బ్రేక్ వేయాలి
బియ్యం మాఫియా డాన్ దొంగ వేణు ఆగడాలను అరికట్టాలని తెలంగాణ రైస్ మిల్లర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి నిబంధనలను తుంగలో తోక్కుతున్నారని. బియ్యం డాన్ కష్టం మిల్లింగ్ రైస్ లో సైతం పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని కోట్లాది రూపాయల వడ్లను అమ్ముకున్నారని, పూర్తిస్థాయి విచారణ చేస్తే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయని మిల్లర్లు తెలియజేస్తున్నారు.

