BRS leaders | బండి సంజయ్ బర్తరఫ్ డిమాండ్‌తో ఆందోళనలు

BRS leaders | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టైన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పాత బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు నిరసనలు కొనసాగిస్తూ బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, డీఎస్పీ నాగేంద్రచారి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బీజేపీ నేతలను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, బీఆర్ఎస్ నేతలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.
