ఎన్నికల బరిలో భార్యాభర్త…

ఎన్నికల బరిలో భార్యాభర్త…

  • 50డివిజన్ నుంచి రంగు అపర్ణ

నిజామాబాద్, ఆంధ్రప్రభ : సాధారణంగా ఎన్నికలంటే ఎత్తుగడలు రాజకీయ విమర్శలే కనిపిస్తాయి. కానీ నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ బరిలో ఆసక్తిక రమైన సన్నివేశం చోటు చేసుకుంది. జీవిత ప్రయా ణంలో ఒకటైన యువ జంట ప్రజాసేవలో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. డివిజ న్ అభివృద్ధి లక్ష్యంగా పక్క పక్క నే గల డివిజన్లో నుంచి భార్య ఒకచోట భర్త ఒకచోట బరిలో నిలవడం చర్చనీ యాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లో ఉండగా 28వ డివిజన్ నుంచి భర్త రంగు సీతారాం బిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలవగా భార్య 50వ డివిజన్ నుంచి రంగు అపర్ణ బిఆర్ఎస్ పార్టీ నుంచి కార్పోరేటర్ గా బరిలో నిలిచారు. ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లో భార్యాభర్తలు పోటీ చేయడం చర్చనీయాం శమైంది.2014 లో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి రంగు అపర్ణ బరిలో నిలవగా విజ యం సాధించింది అదేవిధంగా 2019లో రంగు సీతారాం బరిలో నిలవగా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. గతంలో వారు చేసిన అభివృద్ధి వారిని గెలిపిస్తుందని భార్యాభర్తలు ధీమాతో ఉన్నారు. అదేవిధంగా నగరంలో ఒకే కుటుంబం నుంచి బంధువులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ బరిలో పాల్గొన్నారు.