పురిటి గడ్డకు సేవ చేసేందుకే..నేను పోటీ చేస్తున్నా..

4వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల శంకర్

-4వ వార్డు, శివునపల్లి గ్రామ బాధ్యత నాదే..
-ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతాను
-ఒక్క అవకాశం ఇవ్వండి..మీ వెన్నంటే ఉంటాను
-ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాను.
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య అండతో నిధులు తేస్తాను
-కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు, మహిళల కోసం మహిళా భవన్
-అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
-స్మశానం వాటికా, కాలనీల రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
-ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పక్కా 50 ఇండ్లు ఇప్పిస్తాను
-గతంలోనూ ప్రజాసేవలో ముందుండిన శంకర్
-అభివృద్ధే అజెండాగా మరోమారు ప్రజల ముందుకు..
-చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
4వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల శంకర్

స్టేషన్ ఘన్ పూర్, ఫిబ్రవరి5 ఆంధ్రప్రభ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల శంకర్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నారు. 30 ఏళ్ల రాజకీయ అను భవం కలిగిన నాయకుడిగా, పేదల కష్టాలను దగ్గరగా తెలిసిన వ్యక్తిగా ఆయ నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాటలకే పరిమి తం కాకుండా ప్రతి సమ స్యలో ముందుండి పరిష్కారం చూపిన నాయ కుడిగా ప్రజల్లో విశ్వాసం సంపాదించారు. మూడు సార్లు ఎంపీటీ సీగా, ఒకసారి వార్డు సభ్యుడి గా, అలాగే పీఏసీఎస్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం బూర్ల శంకర్‌కు ఉంది. ఏ పని ఎలా చేయాలో పూర్తి అవగా హనతో పాటు, ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ అన్నలా, ఇంటి బిడ్డలా దగ్గరగా ఉండే స్వభావం ఆయన ప్రత్యేకత. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సు లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి అంటే శంకర్ అన్న అనే పేరును ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇస్తూ వారికి అవకాశాలు కల్పించి ప్రోత్సహించే దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. మాటలు కాదు చేతల్లోనే నాయకత్వం చూపాలనే సంకల్పం తో నాల్గవ వార్డు అభివృద్ధే లక్ష్యంగా మరోసారి ప్రజల ముందుకు వచ్చారు.

-శివునపల్లి గ్రామ బాధ్యత పూర్తిగా నాదే:

వార్డులోని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గురువారం అభ్యర్థి బూర్ల లత శంకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వార్డులోని పలు సమస్యలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలనీ వాసులకు కీలక హామీలు ఇచ్చారు. గెలిచిన వెంటనే వార్డులో 50ఇళ్ళు పక్కా మంజూరు చేయడంతో పాటు 4వ వార్డు బాధ్యత, శివునిపల్లి గ్రామ బాధ్యత పూర్తిగా తనదేనని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో అవసరమైన నిధు లు తెచ్చి అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు. కుల సంఘా లకు కమ్యూనిటీ హాళ్లు, మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా భవన్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే మసీదు దగ్గర నుంచి కుంటకట్ట వరకు రోడ్డు వెడల్పు, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. మిల్లు నుంచి ఎస్సీ కాలనీ వయా జఫర్ గడ్ రోడ్ వరకు రోడ్డు వెడల్పు పనులు, వివర్స్ కాలనీ నుంచి కుంటకట్ట వరకు రోడ్డు ఏర్పాటు, స్మశానం వాటికా వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని పేర్కొన్నారు. గతంలో ఇండ్లు, సీఎంఆర్‌ఎఫ్, విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సేవలు అందించడమే కాకుండా, అవ సరమైన ప్రతీ విషయంలో ప్రజలకు ముందుండి సహాయం చేసానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను సీరియల్ నెంబర్ 2 చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీలు బేతి జైపాల్ రెడ్డి, తదిత రులు పాల్గొన్నారు.

Leave a Reply