హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది..

హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది..

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఎండ తీవ్రతకు బస్సు చక్రపు టైరు పేలిపోయింది.ఈ సంఘటన సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నగరంలోని ఆటో నగర్ నుండి కండ్రిక వైపు వెళ్లే 48ఆర్ సర్వీసు గల ఏపి.03జెడ్ 0122నెంబర్ గల ఆర్టీసీ బస్సు సింగ్ నగర్ ఫ్లైఓవర్పై వచ్చే సరికి బస్సు చక్రం టైరు పేలి ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది.

డ్రైవర్ ఎంతో నైపుణ్యం కలిగి బస్సును కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు బస్సును ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్ పై నుండి డాబా కోట్ల సెంటర్ వరకు తీసుకుని వచ్చారు. ఐతే బస్సులో కొంతమంది ప్రయాణికులతో ఉండటంతో హమ్మయ్య అని పెద్ద గండం తప్పిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply