ఘనంగా గంగానమ్మ తల్లి 47వ సంబరాలు…
ఘనంగా గంగానమ్మ తల్లి 47వ సంబరాలు…
వైభవంగా జరిగిన పటమట లంక గ్రామదేవత గంగానమ్మ తల్లి సంబరాలు
ముఖ్యఅతిధిగా హజరై పూజలు చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : పటమటలంక గంగానమ్మ సంబరాలు మన సంస్కృతికి నిదర్శనమని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. తూర్పు నియోకవర్గంలోని పటమటలంకలో నెలకొనిఉన్న గంగానమ్మ అమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లి 47వ సంబర మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై ఆలయంలోని అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా డప్పులు, వాయిద్యాలు, మంగళ వాయిద్యాలతో గంగానమ్మ ఆలయం పరిసరాలు గంగానమ్మ నామస్మరణతో మారుమ్రోగాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ గంగానమ్మ సంబరాలు అంటే ఒక పూజ మాత్రమే కాదని, పేద, గొప్ప అనే తేడా లేకుండా అందరం ఒకటేనని చెప్పే గొప్ప సంస్కృతి అని అన్నారు. స్థానికులు అందరూ గత 47 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటూ ఒకే మాటతో, భక్తితో గంగానమ్మను పూజించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని, మనం నివశించే ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ గంగానమ్మను కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, టైలర్ శ్రీను, చిలకలపూడి లక్ష్మణ, గోపి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
