బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ..
బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ..
రూ.11.48 లక్షల వైద్యసాయం మంజూరు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడలో నియోజకవర్గ ప్రజలకు వైద్యసాయం అందించడంలో భాగంగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి సౌజన్యంతో మొత్తం రూ.11 లక్షల 48 వేల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను అందజేశారు. ఎన్‌డీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, 42వ డివిజన్ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు, జన సేన పార్టీ 39వ డివిజన్ అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, కొత్తపేట మండల అధ్యక్షుడు బైపిళ్ళ చందు తదితరులు బాధితులకు పత్రాలను అందజేశారు.
39వ డివిజన్‌కు చెందిన గోర్తి శ్రీనివాస్ (62) కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.1.91 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. 42వ డివిజన్ హెచ్‌బీ కాలనీకి చెందిన ఉత్తరవల్లి కోటేశ్వరరావు (47) రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స అవసరమవడంతో ఆయనకు రూ.4.37 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు. అదేవిధంగా 52వ డివిజన్‌కు చెందిన పిళ్ళ మధుసూదన్ (49) హెర్నియా చికిత్స కోసం రూ.2.60 లక్షలు, 38వ డివిజన్ కుమ్మరిపాలెంకు చెందిన షేక్ మాలిన్ ప్యాంక్రియాస్ సంబంధిత వ్యాధి చికిత్స కోసం రూ.2.60 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది.త్వరితగతిన స్పందించి వైద్యసాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
