డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

పలువురు అధికారులకు కొత్త పోస్టింగులు

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో విడుదలైన జి.ఓ.ఆర్.టి నెం.1057 ద్వారా ఈ బదిలీలను తక్షణ ప్రభావంతో అమలు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పి. సాయి బాబును ప్రకాశం జిల్లా డిఆర్వోగా నియమించారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే ఒంగోలు ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా ఉన్న ఎ. కళావతిని కదిరి ఆర్డీవోగా బదిలీ చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేఆర్‌ఆర్సీ ఎస్‌డీసీగా ఉన్న పి. కృష్ణమూర్తిని పెద్దాపురం ఆర్డీవోగా నియమించారు. తిరుపతిలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వి. దేవేంద్ర రెడ్డిని సూళ్లూరుపేట ఆర్డీవోగా బదిలీ చేశారు.

పీడీసీ-2023గా ఎంఏ అండ్ యూడీ శాఖలో పనిచేస్తున్న కె. లక్ష్మీ ప్రసన్నను ఏలూరు ఆర్డీవోగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా విపత్తు నిర్వహణ విభాగంలో డీపీఎంగా ఉన్న దట్ల కీర్తిని విశాఖపట్నం వీఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా నియమించేందుకు ఎంఏ అండ్ యూడీ శాఖకు పంపించారు.

చిత్తూరు జిల్లా డీపీఎం రామావత్ కృష్ణ నాయక్‌ను వీఎంఆర్‌డీఏలో ఓఎస్డీ ప్రాజెక్టులుగా నియమించనున్నారు. జాన్ ఇర్విన్ పాలపర్తిని ప్రకాశం జిల్లాలో సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎస్‌డీసీగా బదిలీ చేశారు.

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బి. అసయ్యను విజయనగరం ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా నియమించారు. జి. గౌరీ శంకరరావును ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించేందుకు సామాజిక సంక్షేమ శాఖకు పంపించారు.

బి. లీలారాణిని పల్నాడు జిల్లాలోని డాక్టర్ కె.ఎల్. రావు సాగర్ (పులిచింతల) ప్రాజెక్టుకు ప్రత్యేక కలెక్టర్ పీఏగా నియమించారు. కె. చెన్నయ్యను కృష్ణా జిల్లా కేఆర్‌ఆర్సీ ఎస్‌డీసీగా, కె. శ్రీరమణిని ఏలూరు పీఐపీ ఆర్‌ఎంసీ యూనిట్-2 ఎస్‌డీసీగా నియమించారు.

జి.వి. సత్యవాణిని కాకినాడ సెజ్ ఎస్‌డీసీగా బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేసి, కొత్త స్థానాల్లో తక్షణమే బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply