అందుకే ఢిల్లీకి వెళ్లా..

అందుకే ఢిల్లీకి వెళ్లా..

సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాట్లాడే సమయంలోనే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం, వారి స్థాయి ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రసంగాన్ని సోషల్ మీడియా వేదికగా 36 లక్షల మంది వీక్షిస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని హరీష్ రావు పేర్కొన్నారు.

ఇది కేసీఆర్ వ్యూయర్‌షిప్‌లో 10 శాతం కూడా లేదని, ప్రజాదరణ ఎవరికి ఉందో దీన్ని బట్టే తెలుస్తోందని అన్నారు. తాను ఢిల్లీకి వెళ్ళింది ముఖ్యమైన న్యాయపరమైన అంశాల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. తన ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి తప్పుడు లీకులు ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. “విషయం ఉన్నవాడు ఇలాంటి చిల్లర పనులు చేయడు.. రేవంత్ రెడ్డి అడ్డమైన లీకులు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు” అని తీవ్రంగా విమర్శించారు. రేపు ఓటుకు నోటు కేసు విచారణ ఉన్న నేపథ్యంలో, ఈ కేసులో దోషులను శిక్షించే వరకు వెనకడుగు వేయబోమని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply