3 days | ఏమైందంటే…

3 days | ఏమైందంటే…

3 days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా రాజమండ్రి పర్యటనలో ఉన్నారు. ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. ఓఎన్జీసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి ఎస్సీ సంక్షేమంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా ఆయనకు ఆకస్మికంగా వాంతులయ్యాయి.

వెంటనే అధికారులు సమావేశాన్ని నిలిపివేసి ఆయనను సమీపంలోని డెల్టా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆహారం వికటించడం లేదా తీవ్రమైన పని ఒత్తిడి వల్ల ఈ అస్వస్థత కలిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆయన పర్యటన కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Leave a Reply