అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తా

2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు మిస్కిన్
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అండగా నిలవండి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగరాజు మిస్కిన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రెండో వార్డు పరిధిలోని దండు గ్రామంలో తన మద్దతు ధరలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో నాగరాజుకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా కుటుంబం ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోరుకుంటుందన్నారు .తొలినాళ్లలో మున్సిపాలిటీ గా ఉన్న సమయంలోను మా తాత నాగురావు కౌన్సిలర్ గా పని చేశారని అప్పట్లో మక్తల్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆ తర్వాత మా అమ్మగారు మేజర్ గ్రామపంచాయతీ సభ్యురాలిగా వార్డు అభివృద్ధి కోసం పని చేశారన్నారు .ప్రస్తుతం సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డ్ నుండి పోటీ చేస్తున్న తాను ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు.2వ వార్డు పరిధిలోని దండు గ్రామం తో పాటు వినాయక్ నగర్, రజక వాడ ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని సిసి రోడ్లు డ్రైనేజీలు పనులు జరుగుతున్నాయి అన్నారు. మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి శ్రీహరి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా నాగరాజు మిస్కిన్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
మాజీ కౌన్సిలర్ గౌడి వెంకట్ రెడ్డి,తప్ప రాము, జి .ఆనంద్, మద్దూర్ కురుమయ్య ,టీ. రవి ,టీ .శేఖర్ ,టీ .చింటూ,ఆర్ .చింటూ,ఎం .మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
