26mayipl | ఐపీఎల్‌లో నేడు క్వాలిఫయర్‌-1

26mayipl | ఐపీఎల్‌లో నేడు క్వాలిఫయర్‌-1

26mayipl | బెంగళూరు vs గుజరాత్
సమయం: రాత్రి 7:30 గంటలకు
వేదిక: HPCA స్టేడియం, ధర్మశాల
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్
బెంగళూరుపై భారీ అంచనాలు

26mayipl | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా మే 26న జరగనున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ చాలెంజ‌ర్స్‌(Royal Challengers Bengaluru), గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదిక కానుంది. విజేత నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఫైనల్‌కు నేరుగా వెళ్లే అవకాశముండటంతో రెండు జట్లు కూడా పూర్తి స్థాయి పోరాటం చేయనున్నాయి.

ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా అద్భుత ప్రదర్శన చేశాయి. లీగ్ దశ ముగిసే సమయానికి బెంగళూరు, గుజరాత్ రెండూ 18 పాయింట్లతో సమంగా నిలిచినా, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా బెంగళూరు టాప్‌లో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న బెంగళూరు మరోసారి టైటిల్‌పై కన్నేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలం. కెప్టెన్ రాజత్ పాటిదార్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులు జట్టును బలంగా నిలబెట్టారు.

గుజరాత్‌కు గిల్‌ నేతృత్వం
మరోవైపు శుభ‌మ‌న్ గిల్‌ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో సమతూకంతో కూడిన ఆటను ప్రదర్శించింది. సాయి సుదర్శన్‌, జోస్ బట్లర్‌, రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండటం వారి బలం. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రబడా, రషీద్ జోడీ ప్రత్యర్థులకు సవాల్‌గా మారింది.

పిచ్‌, వాతావరణ పరిస్థితులు
ధర్మశాల పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో అక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

కీలక ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ – బెంగళూరు
జోష్ హేజిల్‌వుడ్ – బెంగళూరు
శుభ్‌మన్ గిల్ – గుజరాత్
సాయి సుదర్శన్ – గుజరాత్
రషీద్ ఖాన్ – గుజరాత్

CLICK HERE TO READ ipl2026sensation | కోహ్లీ–హెడ్ మధ్య అసలు ఏమైంది…

CLICK HERE TO READ MORE