25Members | ఫెర్టిలిటీ.. హై టెన్షన్!

25Members | ఫెర్టిలిటీ.. హై టెన్షన్!
25Members | తెలంగాణలో గుజరాత్ పోలీసుల సోదాలు
చిన్నారుల విక్రయాలపై ఆరా
శిశు విక్రయాల గుట్టు రట్టు
అక్రమ రవాణా కేసులో పలువురి అరెస్టు
మురుగన్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఆ ముఠా సమాచారంతో పెద్ద ఎత్తున సోదాలు
దేశ వ్యాప్తంగా నవజాత శిశువుల అక్రమ దందా
మురుగన్ భార్య కృష్ణవేణి ఆధ్వర్యంలో మరో గ్యాంగ్
విచారణ స్పీడప్ చేసిన గుజరాత్ పోలీసులు
25Members | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ‘ఆపరేషన్ దేవ్’లో భాగంగా తెలంగాణలో గుజరాత్ పోలీసులు వరుస సోదాలు నిర్వహిస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణ కేంద్రంగా సాగుతున్న భారీ శిశు విక్రయాల ముఠాను గుజరాత్ పోలీసులు రట్టు చేశారు. చిన్నారుల అక్రమ రవాణా చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్స్‌పై గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణవేణి ఆధ్వర్యంలో మరో ముఠా..

ఈ ముఠా దేశవ్యాప్తంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మురుగన్ గ్యాంగ్ ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారుల విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే మురుగన్ భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. లోతైన దర్యాప్తు కోసం హైదరాబాద్‌కు చేరుకున్న గుజరాత్ పోలీసులు ఫెర్టిలిటీ సెంటర్లపై విచారణను ముమ్మరం చేశారు.
click here to read 32years | సమష్టి కృషితోనే.. డీజీపీ స్థాయికి
