ముగిసిన సప్తాహం..

  • ఘ‌నంగా ఘరుడ సేవ శోభాయాత్ర

చెన్నూర్ / ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ జగన్నాధాలయంలో కార్తీక మాసం పాడ్యమి రోజున ప్రారంభమైన సప్తాహ మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా ముగిసింది. స్వామివారి ఘరుడ సేవ శోభాయాత్రతో సప్తాహం వైభవంగా ముగిసింది.

గత గురువారం ప్రారంభమైన ఈ సప్తాహంలో ఏడు రోజుల పాటు భక్తులు నిరంతరం భజనలతో దేవాలయాన్ని మార్మోగించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముగింపు రోజు పట్టణ ప్రధాన వీధుల్లో నిర్వహించిన ఘరుడ సేవ పల్లకి ఉత్సవం ఆకట్టుకుంది. స్వామివారి దివ్యమూర్తి పల్లకిలో విహరిస్తుండగా భక్తులు జయజయ ధ్వనులతో ఆలయ ప్రాంతాన్ని మార్మోగించారు. సప్తాహం సందర్భంగా చెన్నూర్ పట్టణం భక్తి శోభతో నిండిపోయింది.

Leave a Reply