TG | చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం చర్లపల్లి సుగుణ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. రసాయనాల వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.