Women Under 19 World Cup | ఫైన‌ల్స్ లో యంగ్ ఇండియా

సెమీస్ లో ఇంగ్లండ్ చిత్తు చిత్తు
తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం
స్పిన్ ఉచ్చులో ప‌డిన ఇంగ్లీష్ బ్యాట‌ర్స్
సెమీస్ లోనూ రాణించిన తెలుగ‌మ్మాయి త్రిష
2వ తేదిన ఫైన‌ల్స్ లో ద‌క్షిణాఫ్రికాతో ఢీ

కౌలాలంపూర్ : మహిళల అండర్-19 ప్రపంచకప్ ఫైన‌ల్స్ లోకి భార‌త్ జ‌ట్టు ప్ర‌వేశించింది. సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గెలుపు ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్లోనే చేదించి సౌతాఫ్రికాతో జ‌రిగే ఫైన‌ల్స్ పోరుకు రెడీ అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్దారిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో పరునిక సిసోదియా, వైష్ణవీ శర్మ మూడేసి వికెట్లతో విజృంభించగా.. ఆయూష్ శుక్లా రెండు వికెట్లతో రాణించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ పెర్రిన్ 45, కెప్టెన్ నోర్గోవ్ 30 పరుగులు చేశారు. మిగిలిన వారంతా త‌క్కువ స్కోర్ల‌కే వెనుతిరిగారు..

ఇక 114 ప‌రుగులు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు శుభారంభం ఇచ్చారు.. తెలుగ‌మ్మాయి త్రిష గొంగ‌డి, క‌మిలినితో క‌ల‌సి తొలి వికెట్ కు 60 ప‌రుగులు జోడించారు.. త్రిష 35 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరింది.. ఇందులో అయిదు ఫోర్లు ఉన్నాయి. ఇక మ‌రో ఓపెన‌ర్ క‌మిలిని 56 పరుగుల‌తో, సానికా 11 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.

ఫైన‌ల్ పోరు సౌతాఫ్రికాతో ..
ప్రత్యర్థి జట్లను చిత్తు చేసి ఇప్పుడు కీలకమైన ఫైన‌ల్ సమరానికి సిద్ధమైంది. వరుసగా రెండో టైటిల్‌కు అడుగుల దూరంలో నిలిచింది. టీమిండియా టోర్నీ ఆరంభం నుంచే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోంటుంది. ఇటు బ్యాటింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అసా ధార ణ బ్యాటింగ్‌ చేస్తుంటే బౌలింగ్‌లో అందరూ కలిసి కట్టు గా రాణించి యువ భారత్‌ను అజేయంగా నిలు పడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రూప్‌ దశలో వెస్టిం డీస్‌, ఆతిథ్య మలేషియా జట్లతో పాటు పటిష్ట మెన శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. అనంతరం జరిగిన సూ పర్‌-6 సమరంలో బంగ్లాదేశ్‌, స్కా ట్లాండ్‌లపై భారీ విజయాలు నమో దు చేసింది. ఇప్పుడు సెమీస్‌ లో ఇం గ్లండ్ ను చిత్తు చేసింది. ఇక టైటిల్ కోసం ఫిబ్ర‌వ‌రి రెండో తేదిన జ‌రిగే మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా త‌ల‌ప‌డ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *