ఇసుకను అడ్డుకుంటే అటవీ అధికార్లు ఖబర్దార్..

  • ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, ఆంధ్రప్రభ : ఇసుకను అడ్డుకుంటే అటవీ అధికార్లు ఖబర్దార్ అంటూ.. నిర్మల్ డీసీసీ జిల్లా అధ్యక్షుడు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోఎస్ఐఆర్ పై బీఎల్ఏ -2,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి భయపడేదిలేదన్నారు.

మంచిర్యాల ఎఫ్డీపీటీ శాంతారాం, స్థానిక ఎఫ్డీఓ, ఇందనపల్లి,జన్నారం,తాళ్లపేట ఫారెస్ట్ రేంజు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం,సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఇసుక తీసుకువచ్చే ట్రాక్టర్లను ఆపితే తరిమికొట్టాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు.మండలంలోని పొనకల్ మాజీ సర్పంచి జక్కు భూమేష్ ను అరెస్టు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.ఇసుక వ్యవహారంలో కొందరు అటవీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత సీఎంఆర్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్మినారాయణ,వైస్ చైర్మన్ ఫసిహుల్ల,పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజ్మీర నందునాయక్,ఎం.మాణిక్యం,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, జిల్లాఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్,జిల్లాకార్యదర్శి ముజఫర్,నేతలు శంకరయ్య,వెంకటి,వామన్,ఇందయ్య ,సాహెల్, హన్మంతరావు,సుదీర్,రాజన్న, రాజేష్,గణేష్,తదితరులు పాల్గొన్నారు.