రెండేళ్ల చిన్నారికి పునర్జన్మ..
- మేడ్చల్ మెడినోవాలో అరుదైన ‘హైపోస్పాడియాస్’ శస్త్రచికిత్స విజయవంతం
- పుట్టుకతో మూత్రనాళ లోపంతో బాధపడుతున్న చిన్నారికి విముక్తి.
- డా. నితేష్ బట్టల నేతృత్వంలో విజయవంతమైన ‘TIP యూరేథ్రోప్లాస్టీ’ సర్జరీ..
- సకాలంలో స్పందిస్తే సాధారణ జీవితం సాధ్యమేనని నిపుణులు…
మేడ్చల్, ఆంధ్రప్రభ : జన్మతః మూత్ర నాళాల అమరికలో లోపంతో బాధపడుతున్న ఓ రెండేళ్ల చిన్నారికి మేడ్చల్లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. నితేష్ బట్టల నేతృత్వంలోని వైద్య బృందం అత్యంత క్లిష్టమైన ‘TIP యూరేథ్రోప్లాస్టీ’ (Hypospadias Repair) సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి చిన్నారికి సాధారణ జీవితాన్ని ప్రసాదించారు.
సదరు చిన్నారి పుట్టుకతోనే మూత్రనాళం సహజ స్థానంలో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు మేడ్చల్లోని మెడినోవా ఆసుపత్రిని సంప్రదించారు. పరీక్షించిన డా. నితేష్ బట్టల బృందం, దీనిని ‘హైపోస్పాడియాస్’ సమస్యగా గుర్తించారు. ఈ లోపంలో సాధారణంగా మూత్రనాళం యొక్క ద్వారం పురుషాంగం కొన వద్ద కాకుండా, దాని కింది భాగంలో ఏర్పడుతుంది. దీనివల్ల చిన్నతనంలో మూత్ర విసర్జన కష్టమవడమే కాకుండా.. భవిష్యత్తులో లైంగిక సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది.
అత్యాధునిక సాంకేతికతతో విజయవంతమైన చికిత్స
సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. డా. నితేష్ బట్టల ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత సూక్ష్మమైన రీతిలో ఈ ఆపరేషన్ను విజయవంతం చేశారు. సర్జరీ అనంతరం చిన్నారిని నిపుణుల పర్యవేక్షణలో ఉంచి తగిన చికిత్స అందించారు. పూర్తిగా కోలుకోవడంతో సంతృప్తికరమైన ఆరోగ్య స్థితిలో డిశ్చార్జ్ చేశారు. భవిష్యత్తులో ఈ చిన్నారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధారణ మూత్ర విసర్జనతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలడని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టుకతో వచ్చే లోపం మాత్రమే.
దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న వయస్సులోనే సరియైన సమయంలో గుర్తించి శస్త్రచికిత్స చేయించడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో పూర్తిగా సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లల్లో మూత్ర విసర్జన సరిగ్గా లేకపోవడం వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే యూరాలజీ నిపుణులను సంప్రదించాలి.
మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజలకు వరం మెడినోవా అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ వైద్యులు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ల కలయికతో మేడ్చల్ మెడినోవా హాస్పిటల్ ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది. స్థానిక ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తూ నమ్మకమైన ఆసుపత్రిగా నిలుస్తోంది.
