Peddapalli Bus Depot | మహిళల ఉచిత రవాణాతో బస్సులకు డిమాండ్

Peddapalli Bus Depot | మహిళల ఉచిత రవాణాతో బస్సులకు డిమాండ్
Peddapalli Bus Depot | నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నాం
కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Peddapalli Bus Depot | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియ జేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేయడంతో పాటు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
మహిళల ఉచిత ప్రయాణంతో బస్సులకు డిమాండ్
గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగింది.ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తాము. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు.ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేశాము. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దు.

CLICK HERE TO READ కరాటే గ్రేడింగ్‌లో వేములవాడ విద్యార్థుల ప్రతిభ
