డీజీపీని క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌..

డీజీపీని క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ తెలంగాణ, యాద‌వ కో-ఆప‌రేటివ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఎం. ర‌ఘునాథ్ యాద‌వ్‌ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చ‌ర్చించారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా పోలీసు వ్యవస్థకు సామాన్యులకు మధ్య వారధిలా ఉంటూ మన వంతు సహకారం అందించడంపై ప్రత్యేకంగా చ‌ర్చించారు.