కలిసికట్టుగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం

కలిసికట్టుగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం

యువనేత లోకేష్ స్ఫూర్తితో ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు
అధికారం ఉంటే పరిష్కారం ప్రతిపక్షమైతే పోరాటమే టిడిపికి తెలుసు
14వ డివిజన్లో టిడిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ : తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఎంపీ చిన్నికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 14వ డివిజన్ టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఒక కొత్త తరం పాత తరం నాయకులంతా కలిసి కార్యాలయాన్ని ప్రారంభించుటo గొప్ప పరిణామం ఎంపీ చిన్ని అన్నారు.

యువ నేత లోకేష్ నేతృత్వంలో ప్రతి ప్రాంతంలోనూ కార్యాలయం ఏర్పాటు అవ్వడం మంచి విషయమని చిన్ని పేర్కొన్నారు. టిడిపి నాయకులు అధికార పార్టీలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా అదే ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేసే దిశగానే ఉంటారని చిన్ని పేర్కొన్నారు గత పాలకులు ఎవరు ప్రజల దగ్గరకు వెళ్ళిందే లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం లేని కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పైనే దృష్టి సాదించాయి అని తెలిపారు మూడు పార్టీలు కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నాయని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు ప్రజలకు సేవ చేయడమే కూటమి ముందుకు వెళ్తుందని చిన్ని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కర్ణ రమేష్ బాబు, డివిజన్ ఇంచార్జ్ గరికపాటి బద్రి , కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్, మాజీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ ,బిజెపి నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు ,యార్లగడ్డ సందీప్ జనసేన నాయకులు గాదిరెడ్డి అమ్ములు ఎడ్లపల్లి నాగరాజు టిడిపి డివిజన్ కమిటీ సభ్యులు వీరంకి డాంగే కుమారి నర్రా కిషోర్ కర్ణ కోటేశ్వరరావు కుమార్ పాతిరెడ్డి వెంకట్రావు కనిశెట్టి కొండలు రావు సుంకర వెంకన్న ఫాతిమా జ్యోతి కెల్లా రమేష్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply