సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు

సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు

  • ఆర్‌జేటీసీని కలసి కృతజ్ఞతలు తెలిపిన జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు

విజయవాడ,ఆంధ్రప్రభ : స్థానిక బందరు రోడ్డులోని రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం రవాణాశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా ఆర్‌జేటీసీ వడ్డే సుందర్‌ను ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్‌జేటీసీ వడ్డే సుందర్ మాట్లాడుతూ, జోన్–II పరిధిలో జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. నిష్పాక్షికంగా, పారదర్శకంగా సేవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి, రవాణాశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

ప్రజల్లోనూ, అధికారులలోనూ మంచి గుర్తింపు పొందేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఆయన అన్నారు. జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు మాట్లాడుతూ, చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులను ఆర్ జేటిసి గా జోన్2 బదిలీపై వచ్చిన తక్కువ సమయంలోనే అమలు చేయడం పట్ల ఆర్‌జేటీసీ వడ్డే సుందర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత వారం తనతో పాటు సంఘ నాయకులు కలిసి పదోన్నతుల విషయంపై వినతిపత్రం సమర్పించగా, దానిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల మేలు చేసే విధంగా నిర్ణయం తిసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

పదోన్నతులు కల్పించడంతో పాటు ఉద్యోగులను వారు కోరుకున్న స్థానాల్లో నియమించడం మరింత సంతోషకరమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ సానుకూలంగా స్పందించే అధికారి గా వడ్డే సుందర్‌ను కొనియాడారు. ఆర్ జె టి సి వడ్డే సుందర్ చేతుల మీదుగా పదోన్నతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ సహాధ్యక్షుడు డి. రామ్మూర్తి, కోశాధికారి కె. రామచంద్రరాజు, జి ఆర్ శ్రీకాంత్, పదోన్నతులు పొందిన సభ్యులు పి. చాందిని, యం. మణిస్విని, యం. రవి తేజ, కె. లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply