ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు
పటమట – ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన ముద్ర వేసిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విజయవాడ పడమట దర్శిపేట సర్కిల్‌లో అభిమానులు నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని, నటుడిగానే కాకుండా సాంకేతిక రంగంలోనూ అనేక వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టి పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేశారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
కృష్ణ నటన, వ్యక్తిత్వం, సినీ రంగానికి అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో చలపాటి సన్నీ, చింతల సాంబయ్య, శెటికం దుర్గ, ఎస్‌కే బాజీ, కల్లూరి కోటి, సుభాని, మోహన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
