పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: ముప్పు శ్రీనివాస్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చి, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు కాటం రాజు, పోలు కిరణ్, బొజ్జ సతీష్, బొజ్జ రాజయ్య, బొజ్జ రవీందర్, బొజ్జ గోపాల్, కంబాల రమేష్‌తో పాటు ముదిరాజ్ కులసంఘం సభ్యులు పాల్గొన్నారు.