కనకాపూర్‌లో విషాదం

కనకాపూర్‌లో విషాదం

  • మంటల్లో చిక్కుకుని రైతు మృతి..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. మంద గంగన్న (56), తండ్రి ఎల్లన్న, మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో తన చేనులో వృథాగా పడి ఉన్న మొక్కజొన్న కర్రలకు నిప్పు పెట్టాడు. అయితే మంటలు ఒక్కసారిగా చెలరేగి పక్కనే ఉన్న వరి పంటల వైపు వ్యాపించాయి.

వరి పంట కాలిపోతుందేమో అన్న భయాందోళనలకు గురైన గంగన్న, మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అతని శరీరానికి అంటుకోవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు ఎస్సై తెలిపారు.

మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply