కలుషిత ఆహారం తిని 13 మందికి అస్వస్థత. -సి ఐ

కలుషిత ఆహారం తిని 13 మందికి అస్వస్థత. -సి ఐ
ముగ్గురి పరిస్థితి విషమం
కలుషిత ఆహారం తిని 13 మంది అస్వస్థత చెందారని నిడమర్రు సిఐ ఎన్ రజిని కుమార్ అన్నారు. గణపవరం మండలం ఎస్ కొందేపాడు గ్రామంలో మైసూర్ బజ్జీలు తినడం వల్ల 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, దీనిలో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉందని వారిని భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని, వారు దానమ్మ, దీపిక, వెంకటలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 9 మంది భీమవరం చికిత్స లో పొందుతున్నారని, బజ్జీలు తిన్న వెంటనే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలియజేశారని అన్నారు. ముందుగా వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా అక్కడి నుంచి భీమవరం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికిరణ్ వెల్లడించారు. మరొక బాధితుడు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుకుంటున్నారని తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు
ప్రమాదానికి కారణం
గణపవరం ఎస్ఐ ఏ మణికుమార్ తెలిపిన వివరాలు ప్రకారం
ఎస్ కుందేపాడు గ్రామానికి చెందిన మిర్యాల మణికంఠ నాని రొయ్యల చెరువు మీద పనిచేసుకుంటూ రోగిల చెరువు వద్ద ఉంచిన మైదాపిండిని తన బంధువైన మూకట్ల కనకదుర్గకు ఇవ్వగా ఆమె పిండితో మైసూర్ బజ్జీలు వేసి వారి కుటుంబ సభ్యులతో పాటు తన ఇంటి పక్క ఉన్నవారికి ఆ బజ్జీలు ఆమె పెట్టింది. అవి తిన్న వెంటనే వారికి వాంతులు అపస్మార్క స్థితికి వెళ్లగానే వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
