Affair | క‌డ‌తేర్చిన క‌న్న‌కొడుకులు

Affair | క‌డ‌తేర్చిన క‌న్న‌కొడుకులు

Affair | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ప్రియురాలితో క‌లిసి ఉండ‌టం చూసి క‌న్న‌కొడుకులు కోపోద్రిక్తుల‌య్యారు. క‌న్న తండ్రి అని కూడా చూడ‌కుండా క‌డ‌తేర్చారు. ఈ సంఘ‌ట‌న భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో చోటుచేసుకుంది. చేరాలు అనే వ్య‌క్తికి భార్య, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అయితే భార్య పిల్ల‌లు హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. చేరాలు గ్రామంలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. శ‌నివారం రాత్రి కుమారులు రేపాక‌లోని ఇంటికి వచ్చారు. అదే సమయంలో మరో మహిళతో తండ్రి ఉండడం గమనించి ఆగ్ర‌హించారు. వారిద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఇద్దరిని పరకాల ప్రభుత్వాస్పత్రికి.. త‌ర్వాత‌ ఎంజీఎం తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చేరాలు మృతి చెందాడు. రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబంధం కారణంగా తండ్రిని హత్య చేసిన సంఘటన రేగొండ మండలం రేపాక గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే, రేపాక గ్రామానికి చెందిన కుర్రే చేరలు (55) కూలి పని చేసుకుంటూ అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయం కుటుంబంలో వివాదాలకు దారితీసింది.మృతుని భార్య సులోచన హైదరాబాదులో వారి కుమారులు దగ్గర ఉండేది.ఈ విషయం తెలుసుకున్న మృతుని కుమారులు కుర్రే రామ్, కుర్రే లక్ష్మణ్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఆదివారం రాత్రి సుమారు 01:20 గంటల సమయంలో హైదరాబాద్ నుండి గ్రామానికి వచ్చి,అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు.

Affair

అందులో, కుర్రే రామ్ తండ్రి చేరలను పట్టుకోగా, కుర్రే లక్ష్మణ్ తనతో తీసుకొచ్చిన గొడ్డలితో తలపై తీవ్రంగా దాడి చేయడంతో చేరలు తీవ్రంగా గాయపడ్డాడు.అడ్డుకోవడానికి వచ్చిన మహిళపై కూడా దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుండి పరారయ్యారు.గాయపడిన వ్యక్తిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 04:30 నిముషాల సమయంలో మరణించాడు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కర్ణాకర్ రావు తెలిపారు.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Leave a Reply