నూతన పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
నూతన పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
కంకిపాడు – ఆంధ్రప్రభ : కంకిపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనంను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం పరిశీలించారు. ప్రారంభోత్సవంలో హోం మంత్రి అనిత, డీజీపీ గుప్తా హజరుకానుండటంతో బోడే ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈనెల 11వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ డి సందీప్, జిల్లా టీడీపీ నేత తుమ్మలపల్లి హరికృష్ణ, స్థానిక నేతలు మద్దాలి రామచంద్రరావు, వీరంకి శ్యామ్, జరుగు శ్రీనివాసరావు, మన్నే శ్రీనివాస్ పాల్గొన్నారు.
