ప్రైమరీ హెల్త్ సెంటర్లోఘనంగా జాతీయ పల్స్ పోలియో
ప్రైమరీ హెల్త్ సెంటర్లోఘనంగా జాతీయ పల్స్ పోలియో
చుక్కలు వేసిన మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్.
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని పుప్పలగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఈరోజు (28-06-2026) జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ ఇంచార్జ్ వైద్యులు డాక్టర్ బుజ్జరి దిలీప్ తో కలిసి మాజీ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, ‘పోలియో రహిత భారతదేశం’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం(ANM)లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
