ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: జగ్గరి వెంకటరెడ్డి
వికారాబాద్, ఆంధ్రప్రభ: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకుడు జగ్గరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఎన్నేపల్లిలోని పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
