నిన్ను జీవితానికి రెండు చుక్కలు..

నిన్ను జీవితానికి రెండు చుక్కలు..

  • ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
  • ఎంఆర్‌పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమానికి శ్రీకారం
  • చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
  • జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం

తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఐదేళ్లలోపు పిల్లలను పోలియో వ్యాధి నుంచి రక్షించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

తిరుపతి ఎంఆర్‌పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే తరాలను పోలియో మహమ్మారి నుంచి కాపాడడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.