కవాడిగూడలో మహిళ దారుణ హత్య

కవాడిగూడలో మహిళ దారుణ హత్య
- కత్తితో దాడి చేసి పరారైన నిందితుడు..
- దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి పరారైనట్లు సమాచారం.
హత్యకు గురైన మహిళను శ్వేతగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది.
బిల్డింగ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
