108 అంబులెన్సులోనే…

108 అంబులెన్సులోనే…

దర్శి, ఆంధ్రప్రభ : పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతిని 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమై 108 సిబ్బంది సేవలోనే సుఖ ప్రసవం జరిగిన ఘటన సోమవారం వెంకటాపురం – దర్శి మార్గంలో చోటుచేసుకుంది. దర్శి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన యం. గురులక్ష్మీ (22) నిండు గర్భవతి నొప్పులు రావడంతో దర్శి 108 వాహనానికి ఫోన్ చేశారు. ఫోన్ కాల్ అందుకున్న స్థానిక 108 సిబ్బంది వెంకటాపురం చేరుకొని గర్భవతిని 108 వాహనంలో దర్శికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు తీవ్రమై ప్రసవానికి దారితీసింది. ప్రసవ వేదనలో ఉన్న మహిళలకు సేవలు అందించి సుఖప్రసవం చేయించి నందుకు సిబ్బందిని గురులక్ష్మీ కుటుంబీకులు, స్థానికులు అభినందించారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన గురులక్ష్మీ తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.