పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ

పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ

  • శిఖాకొల్లి శంకరరావు గృహాంలో 11 సవర్ల బంగారం,1/2 కేజీ వెండిచోరీ
  • రూ. 20 వేలు నగదు మయం, వేలిముద్రలు పరిశీలిస్తున్న క్లూస్ టీమ్
  • గృహ యజమానుల వేలిముద్రలు సేకరకణ
  • చోరీ జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్సై కమలాకర్, క్లూస్ టీం సీఐ రవీంద్రారెడ్డి

ముండ్లమూరు,ఆంధ్రప్రభ: ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు గ్రామంలోని శిఖాకొల్లి శంకరరావు ఇంటిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే ఉల్లగల్లు గ్రామానికి చెందిన శిఖాకొల్లి శంకరరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి సింగరకొండ లోని పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాలకు వెళ్లి, స్వామి వారిని దర్శించుకుని తిరుణాలను చూసి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చారు.

ఇంటికి వచ్చి చూడగానే తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 11 సవర్ల బంగారం, 1/2 కేజీ వెండి, రూ 20000 వేలు నగదు చోరీ జరిగినట్లు గుర్తించి ముండ్లమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శంకరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె. కమలాకర్, ఏఎస్ఐ పి. వి. హనుమంతరావు, ఒంగోలు క్లూస్ టీం సీఐ కె. రవీంద్రారెడ్డి చోరీ జరిగిన గృహాన్ని పరిశీలించి, శంకరరావు కుటుంబ సభ్యులను చోరీ జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వేలిముద్రలు సేకరించి, శంకరరావు కుటుంబ సభ్యుల వేలి ముద్రలను సేకరించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి నిందితులను పట్టుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు. క్లూస్ టీం అధికారులు సీఐ రవీంద్రారెడ్డి, సునీల్, ఏసుబాబు వేలిముద్రను సేకరించారు.

Leave a Reply