మహాత్మ జ్యోతి భాపులే పాఠశాలలో 100% ఉత్తీర్ణత..
మహాత్మ జ్యోతి భాపులే పాఠశాలలో 100% ఉత్తీర్ణత..
రేగొండ, ఆంధ్రప్రభ : పదవ తరగతి ఫలితాల్లో రేగొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి భాపూలే (లింగాల) పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంజెపి ప్రిన్సిపాల్. జి.విజయ తెలిపారు. మహాత్మ జ్యోతి భాపులే (లింగాల) గాoధీనగర్ పాఠశాల విద్యార్థులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యుత్తమ మార్కులు సాధించి వరంగల్ జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచారు. పది ఫలితాలలో సంగని వేధిత, 579/600, ఎమ్.లక్ష్మీ ప్రసన్న 576/600, కే.అర్చన 573/600 మార్కులు సాధించి పాఠశాలకు 100% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
