ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు ముమ్మర తనిఖీలునిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కాలేజీకి చెందిన ఓ బస్సులో అనుమతించిన 40 సీట్లకు బదులుగా 52 మంది విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సంబంధిత బస్సుపై కేసు నమోదు చేసి, యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, పాఠశాల యాజమాన్యాలు రవాణా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీఏ అధికారులు సూచించారు.