ఉట్నూర్ సర్పంచ్, వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఉట్నూర్ సర్పంచ్, వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఉట్నూర్, ఆంధ్రప్రభ:
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, వార్డ్ సభ్యుడు పందిరి భీమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అనిత శ్రీనివాస్ జాదవ్, పందిరి భీమన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, అదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఏక్బాల్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ అష్రద్ బేగం అన్సారి, లక్కారం మాజీ సర్పంచ్ మారసుకోల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
