Zone-4 | ఏఎస్ఐలకు ప్ర‌మోష‌న్‌..

Zone-4 | ఏఎస్ఐలకు ప్ర‌మోష‌న్‌..

  • జోన్–4లో 15 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి
  • విల్లింగ్‌నెస్ లేఖలు వెంటనే పంపించాలి : డీఐజీ ఆదేశాలు

Zone-4 | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జోన్–4 పరిధిలోని కర్నూలు, అనంతపురం రేంజ్‌లలో పనిచేస్తున్న 15మంది హెడ్ కానిస్టేబుళ్లు/అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లను (ఏఎస్ఐలు) ర్యాంక్ ప్రొమోటి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐలు) పదోన్నతి ఇవ్వనున్నారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. జోన్–4(Zone-4)కు సంబంధించిన “సి” లిస్టులో రిపి ఎస్‌ఐలుగా పనిచేయడానికి అర్హులుగా ఎంపికైన ఈ ఏఎస్ఐలను ప్రస్తుత ఖాళీల్లో ఎస్‌ఐలుగా ప్రమోట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల నుంచి విల్లింగ్‌నెస్ లేదా అన్‌విల్లింగ్‌నెస్ లేఖలను వెంటనే సేకరించి పంపించాలని డీఐజీ సూచించారు.

పదోన్నతి పొందిన‌వారు వీరే..
ఎ. యువ రాజు – నంద్యాల
ఎస్. ఖాదర్ వలి – కర్నూలు
బి. శివానంద – అనంతపురం
పి. పుట్టప్ప – శ్రీ సత్యసాయి జిల్లా
పి. నారాయణ రెడ్డి – అనంతపురం
శ్రీనివాసులు – అనంతపురం
కె. పీటర్ రాజశేఖర్ రెడ్డి – వైఎస్సార్ కడప జిల్లా
జి. రఘు రామయ్య – అన్నమయ్య జిల్లా
జి. గంగన్న – వైఎస్సార్ కడప జిల్లా
ఎస్. మోహన్ బాబు – వైఎస్సార్ కడప జిల్లా
సి. శివ శంకరయ్య – వైఎస్సార్ కడప జిల్లా
ఆర్. శంకరయ్య – వైఎస్సార్ కడప జిల్లా
జె. నాగయ్య – వైఎస్సార్ కడప జిల్లా
ఎం. మక్బుల్ బాషా – వైఎస్సార్ కడప జిల్లా
ఆర్. బాషు – వైఎస్సార్ కడప జిల్లా

Zone-4 | క్రిమినల్, కోర్టు కేసుల వివరాలు తప్పనిసరి..

పదోన్నతికి అంగీకరించిన అధికారులపై ఏవైనా క్రిమినల్ కేసులు, కోర్టు కేసులు, ఓఈలు, ఎమ్‌పీఆర్‌లు, ప్రైవేట్ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయా లేదా అని పూర్తి వివరాలను వారి సేవా రికార్డులతో సహా తక్షణమే రిటర్న్ సిగ్నల్(return signal) ద్వారా పంపించాలని ఆదేశించారు.ఈ ఉత్తర్వులను అత్యవసరంగా అమలు చేయాలని నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఎస్పీలకు, అలాగే కర్నూలు ఎస్పీ (బీహెచ్)కు డీఐజీ స్పష్టం చేశారు.

Leave a Reply