YS Jagan | వైఎస్ జగన్ పర్యటన రద్దు

YS Jagan | వైఎస్ జగన్ పర్యటన రద్దు

YS Jagan | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఇడుపులపాయ పర్యటన రద్దయ్యింది. ప్రస్తుతం వైయస్ జగన్ జ్వరం (fever) తో బాధపడుతున్నారని పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించింది. దీంతో ఇవాళ పులివెందులలో జరగాల్సిన రెండో పర్యటన వాయిదా పడింది. జగన్ కు తగిన విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని సమాచారం. అందుకే నేటి కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే రెండో రోజైన ఇవాళ‌ పర్యటన జ్వరం కారణంగా ఆకస్మికంగా నిలిచిపోయింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ (Idupulapaya) చేరుకోవాల్సింది. అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ (Christmas) ప్రత్యేక ప్రార్థనాల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందులకు తిరుగు ప్రయాణమైన భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించి అక్కడే బస చేయాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణంగా వాటన్నింటిని వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది.