Operation Sindoor | ప్రపంచ మిలటరీ చరిత్రలో విలక్షణంగా నిలిచిన సిందూర్

Operation Sindoor | ప్రపంచ మిలటరీ చరిత్రలో విలక్షణంగా నిలిచిన సిందూర్

Operation Sindoor | పాకిస్తాన్ ఉగ్రవాద వ్యూహాలపై భారత్ అప్రమత్తం
డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్లతో మారుతున్న యుద్ధ రీతులు
చైనా-పాక్ సైనిక బంధంపై పెరుగుతున్న ఆందోళనలు
అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాల కంటే దౌత్యానికే ప్రాధాన్యం

Operation Sindoor | ప్రపంచంలో మిలటరీ ఆపరేషన్స్లో విలక్షణమైన ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని మిలటరీ ఆపరేషన్స్లో ఇది చాలా చెప్పుకోదగినదే కాకుండా, మిలటరీ విన్యాసాల్లో విలక్షణమైనది. ముఖ్యంగా ప్రస్తుత అణు ప్రపంచంలో ఇది చాలా గొప్పగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యుద్ధ రీతులు మారాయి. ఇలాంటి ఆపరేషన్ మళ్లీ జరుగుతుందా అంటే చెప్పలేం. మళ్లీ దానికి కొత్త విధానాలను అనుసరించాల్సి ఉంది. వచ్చేసారి జరిగే మిలటరీ ఆపరేషన్స్లో ఇంత కఠినమైనవి ఉండకపోవచ్చు. దీని అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కొత్త మిలటరీ ఆపరేషన్స్ ఎలా ఉండవచ్చో తెలుసుకుందాం.

సిందూర్లోని విలక్షణాలు:
యుద్ధ రీతుల్లో ఆపరేషన్ సిందూర్ మూడు రకాలుగా విలక్షణమైనది. మొదటిది ఏమిటంటే, 88 గంటల సేపు జరిగిన ఆపరేషన్ మనం నిర్ణయించుకున్నట్టుగానే ముగిసింది. ఉక్రెయిన్, ఇరాన్, ఇతర యుద్ధాలతో పోలిస్తే ఆపరేషన్ సిందూర్ సాగదీయబడలేదు.

రెండోదేమిటంటే… ప్రతిదాడికి మధ్య విరామాన్ని పాటించింది. పాకిస్తాన్ తిరిగి కొట్టడానికి అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్ దౌత్యాన్ని దెబ్బతీస్తూ వచ్చింది. భారతిని అణ్వస్త్రాల పేరిట బ్లాక్మెయిల్ చేయలేరని పాకిస్తాన్ను హెచ్చరిస్తూ వచ్చింది. అలాగే, ఆపరేషన్ సిందూరిని సరైన సమయంలో నిలిపివేసింది. ఇది యుద్ధ సమయాల్లో చాలా ముఖ్యం.

భవిష్యత్ గురించి ఆలోచిస్తే, పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికీ పాకికి చెందిన ఐదు మాడ్యూల్స్ పని చేస్తున్నాయి. వీటిల్లో ఒకటి బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చి పని చేస్తున్నాయి. భారత్లోకి ఆయుధాలను దొంగచాటుగా చేరవేస్తున్నాయి. నేపాల్ భారత్ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తూ ఉండటం, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ అంతర్జాతీయంగా పలు మార్గాలనుంచి ఎదురుగాలులను ఎదుర్కోవడం వంటి కారణాల వల్ల భారత్ ఆచితూచి అడుగులేస్తున్నది. గత ఏప్రిల్ నెలలోనే, దాడులకు ప్రయత్నించిన ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు. ఇస్లామిక్ స్టేట్ వాదుల ప్రోద్బలంతో వారు చొరబాట్లకు ప్రయత్నించి ఉండవచ్చు. తెహ్రీక్ ఎ తాలిబన్ సంస్థ సభ్యులు బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

తదుపరి ఉగ్రవాద దాడి ఎక్కడి నుంచైనా జరగవచ్చు. ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, పొరుగుదేశాల నుంచి చొరబాట్ల వల్ల కానీ, ప్రమాదాలు ముంచుకుని వచ్చే అవకాశం ఉంది. మన దేశంలోకి పాకిస్తాన్ ఆయుధాలు దిగుమతి అవుతున్నాయి. గతంలో కన్నా పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు చాలా శక్తిమంతంగా ఉంది. ప్రైవేట్ జెట్లు, నిర్ణయాలు తీసుకోవడంలో పాక్ సైన్యం ఇప్పుడు ముందుంటున్నది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ ఆయుధాల దిగుమతి 66 శాతం పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చైనా పాకికి 80 శాతం ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీనికి తోడు స్టెల్త్ ఫైటర్ విమానాలను పాకిస్తాన్ తన వైమానిక దళంలో చేర్చుకుంది. ఇవి చాలా శక్తిమంతమైనవి. ఈ పరిణామం భారత్‌కు ఆందోళన కలిగించే విషయం.

అంతేకాక, చైనా సాయంతో పాకిస్తాన్ హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లను దిగుమతి చేసుకుంది. వీటిని చూసుకునే పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి మన దేశంలోని ఈశాన్య ప్రాంతం, దక్షిణ ప్రాంతంలో దాడి చేసే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారు. భారత్ వల్ల తమ రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవాల్సి వస్తోందని చైనా చెబుతోంది. పహల్గావ్ దాడికి ముందు చైనా శాటిలైట్ ఇమేజరీలను పాకిస్తాన్‌కు అందించింది. ఇమేజరీలను వరుసగా అందించడం వల్ల పాకిస్తాన్‌కు మేలు జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ వ్యూహాత్మక రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసింది. ఇవి అణ్వస్త్ర కమాండ్ నుంచి పనిచేసే సంప్రదాయ రాకెట్లు. ప్రస్తుత యుద్ధాలలో డ్రోన్ల ప్రయోగం ఎక్కువగా ఉంటోంది. ఇరాన్ 650 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ యుద్ధంలో 500 ప్లస్ వెస్ట్ సప్లయిడ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్లు ఎక్కువ నష్టాలను కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం ఏ దేశమూ కూడా నిబంధనలను పాటించడం లేదు. అన్నింటికన్నా అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఓ మాట అన్నారు. అణ్వస్త్ర దేశాల మధ్య దౌత్యపరంగానే వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుందని. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ కాంక్షను పదేపదే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాల కన్నా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు చిక్కుముడులతో కూడి ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి తీవ్రమైన ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదం చిన్న విషయమేమీ కాదు. భారత్ ఇప్పుడు సాధారణ పాకిస్తాన్‌తో కాదు. అణ్వస్త్ర పాకిస్తాన్‌తో పోరాడవల్సి ఉంది. కనుక, ఈ విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. అందువల్ల ఆపరేషన్ సిందూర్ మరోసారి చేపట్టడం అంత సులభం కాదు.

న్యూస్ డెస్క్

Leave a Reply