బక్రీద్ సందర్భంగా గో సంరక్షణపై యువకుల ప్రదర్శన

కేసముద్రం, ఆంధ్రప్రభ : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరిం చుకొని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం యువకులు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీతో ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఈద్గా వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి “హిందూ ముస్లిం భాయ్ భాయ్”, “గో సంరక్షణ దేశ బాధ్యత” అంటూ నినాదాలు చేశారు. కేసముద్రం విలేజ్ లోను ముస్లిం ఫ్లెక్సీ తో అవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.

ఈ సందర్భంగా పలువురు ముస్లిం యువకులు మాట్లాడుతూ దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలంటే పరస్పర గౌరవ భావన అవసరమన్నారు. గోవు భారతీయ సంస్కృతి, రైతాంగ జీవన విధానంతో ముడిపడి ఉన్న జంతువని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దేశ ఐక్యత, సోదరభావం బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడ తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మునిసిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply