ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది..

  • మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు

మధిర, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని మధిర మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం మధిర రిక్రియేషన్ క్లబ్ కళ్యాణమండపంలో 42 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన జవ్వాజి నటరాజకుమారి పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొండబాల మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన ప్రతివారు తప్పనిసరిగా పదవి విరమణ పొందాలి. అయితే విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసినప్పుడు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. ఎంతోమంది విద్యార్థి విద్యార్థులను నటరాజకుమారి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు యడ్లపల్లి శ్రీనివాసరావు నట రాజకుమారి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.