ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

పరకాల, ఆంధ్రప్రభ : దోస్తు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసిందని, విద్యార్థుల సౌకర్యార్థం పరకాల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వాలంటరీ హెల్ప్ లైన్ సెంటర్ ను మంజూరు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందగోరే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అడ్మిషన్ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ మల్లయ్య ను మరియు దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ డి సంజయ్ కుమార్ ను 94411 21301, 9573956412 నెంబర్లలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకోసం రూ 200 చెల్లించాలని, ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారని తెలిపారు.
మే 14వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని, మే 15 నుంచి మే 25వ తేదీ వరకు రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకోసం రూ 400 చెల్లించాలని, మే 15 నుండి మే 26 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారని, మే 30వ తేదీన రెండవ విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని, మూడో విడత మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, జూన్ 20వ మూడో విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఈ మూడు విడుతలలో సీట్లు పొందిన విద్యార్థులు అన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
