YOGA | జిల్లెల్లమూడిలో యోగా పోటీలు

YOGA | జిల్లెల్లమూడిలో యోగా పోటీలు
- ఈ నెల 27, 28, 29 తేదీలలో నిర్వహణ
- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు
YOGA | బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు బాపట్ల మండలంలోని జిల్లెల్లమూడి విశ్వ జననీ పరిషత్ ప్రాంగణంలో జాతీయస్థాయి యోగా పోటీలకు ఈ నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్నట్లు బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. ఈ రోజు జిల్లెల్లమూడి గ్రామంలో విశ్వ జననీ పరిషత్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక కాబడిన అభ్యర్థులు ఈ పోటీలకు తరలిరానున్న నేపథ్యంలో వారికి వసతి, బస, భోజనం తదితర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోటీలు జరిగే ప్రదేశం, సభాస్థలిని సందర్శించారు.

ఈ యోగా పోటీలకు పలువురు మంత్రులు ముక్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. ఆంధ్ర యోగా అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాథ్‌రెడ్డి, కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, శీలం శ్రీనివాసరావు, రెడ్డి నాగరాజు, ఏరియా ఆసుపత్రి వైద్యులు సూపరింటెండెంట్ డాక్టర్ కొప్పుల సిద్ధార్థ, వీరభద్రరావు, ప్రముఖ సైకాలజిస్ట్ పిన్ని బోయిన శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

