పుట్టెడు దుఃఖంలో పరీక్షలు రాసి..

పుట్టెడు దుఃఖంలో పరీక్షలు రాసి..
- ప్రతిభ చాటిన విద్యార్థి..
- తండ్రి శవం ఇంట్లో ఉన్నా…
- తాను పరీక్షలు రాసిన వైనం
మోత్కూర్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ నగర్ కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరేళ్ల ఎల్లయ్య పదవతరగతి పరీక్షల ముందు రోజే గుండెపోటుతో మృతి చెందారు.మార్చి 14 న పదవతరగతి పరీక్షలు ప్రారంభం కాగా తొలి పరీక్ష రోజే ఓ పక్క తండ్రి శవం ఇంట్లో ఉన్నా…కొడుకు హర్షవర్ధన్ మాత్రం పరీక్ష రాశాడు.హర్షవర్ధన్ స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదువుతున్నాడు.పది ఫలితాల్లో 553 /600 మార్కులు సాధించి హర్షవర్ధన్ పుట్టెడు దుఃఖం లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు.పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలలో పాల్గొన్న హర్షవర్ధన్ కన్నీటి పర్యంతం అందరిని కంట తడి పెట్టించింది.తన తండ్రి ఆశయం మేరకు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందడమే తన లక్ష్యమని హర్షవర్ధన్ తెలిపారు.
